ఉదయాన్నే బ్రష్ చేయొద్దు... బోలెడు లాభాలు మిస్...

by Sujitha Rachapalli |
ఉదయాన్నే బ్రష్ చేయొద్దు... బోలెడు లాభాలు మిస్...
X

దిశ, ఫీచర్స్: మార్నింగ్ లేవగానే బ్రష్ చేయడం అందరికీ అలవాటు. కానీ ఉద్దేశపూర్వకంగానే ఈ పద్ధతిని మానుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. మనం రాత్రి పడుకున్నాక ఉత్పత్తి అయ్యే లాలాజలంలో విటమిన్ B12 ఉంటుంది. ఈ విటమిన్ ను శరీరం తయారు చేయదు. కాబట్టి ఆహారం లేదా సప్లిమెంట్స్ ద్వారా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి బదులు ఉదయం పూట బ్రష్ చేసేకు ముందే.. నిద్ర లేవగానే నీళ్లు తాగితే ఆ లాలాజలంలోని విటమిన్ బి12 ను చిన్న ప్రేగు శోషించుకుంటుంది అంటున్నారు నిపుణులు. దీనివల్ల దంతక్షయం, దంత సమస్యలు దరిచేరవని సూచిస్తున్నారు.

నోటి పుండ్లను నివారించడం, చిగుళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం నుంచి నోటి కణజాల సమగ్రత, నరాల పనితీరు, హృదయనాళ ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడం వరకు అనేక ప్రయోజనాలు ఉంటాయి. రక్త కణాలను ఏర్పరచడంలో, డిఎన్ఏ సృష్టి, జీవక్రియకు సహాయపడుతుంది.

Advertisement

Next Story

Most Viewed