పాశ్చాత్య దేశాలు అసూయతో ఉన్నాయి.. మోడీ పర్యటనపై రష్యా వ్యాఖ్యలు

by Shamantha N |
పాశ్చాత్య దేశాలు అసూయతో ఉన్నాయి.. మోడీ పర్యటనపై రష్యా వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్రమోడీ పర్యటనపై రష్యా స్పందించింది. మోడీ రష్యాలో పర్యటించడాన్ని చూసి పాశ్చాత్య దేశాలు అసూయ పడుతున్నాయని క్రెమ్లిన్ పేర్కొంది. మాస్కోలో మోడీ విస్తృతంగా పర్యటించనున్నట్లు క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ తెలిపారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ప్రధాని మోడీ అనధికారికంగా చర్చలు జరపొచ్చని రష్యా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. ప్రధాని మోడీ రాకను పశ్చిమ దేశాలు నిశితంగా పరిశీలిస్తున్నాయని, అసూయతో చూస్తున్నాయని పెస్కోవ్ అన్నారు. రష్యా-భారత సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయిలో ఉన్నాయని పేర్కొన్నారు. మోడీ, పుతిన్ విడిగా చర్చించుకోవడంతో పాటు ప్రతినిధులతో పాటు రెండు చర్చలు జరుగుతాయని వెల్లడించారు. ఇది భారత్, రష్యా సంబంధాల్లో కీలకమైన పర్యటన అని అన్నారు.

ఐదేళ్ల తర్వాత రష్యాలో పర్యటిస్తున్న మోడీ

22వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి పుతిన్ ఆహ్వానం మేరకు మోడీ రష్యా వెళ్తున్నారు. 2022లో ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత మోడీ రష్యాలో పర్యటించడం ఇదే తొలిసారి. దాదాపుగా ఐదేళ్ల క్రితం 2019లో ఫార్ ఈస్ట్ సిటీ వ్లాడివోస్టాక్‌లో జరిగిన ఆర్థిక సమావేశం కోసం మోడీ రష్యాకు వెళ్లారు. ఆ తర్వాత పుతిన్ చివరిసారిగా 2021లో భారతదేశాన్ని సందర్శించారు.

Advertisement

Next Story

Most Viewed