‘NKR21’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.. మంటను చేతిలో పట్టుకుని వైల్డ్‌గా కళ్యాణ్ రామ్

by Hamsa |
‘NKR21’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.. మంటను చేతిలో పట్టుకుని వైల్డ్‌గా కళ్యాణ్ రామ్
X

దిశ, సినిమా: నందమూరి కళ్యాణ్ రామ్ 2022లో బింబిసార సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చాడు. ప్రస్తుతం ‘nkr21’ వర్కింగ్ టైటిల్‌తో వస్తున్న మూవీతో కళ్యాణ్ రామ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే విడుదలైంది.

కానీ ఎలాంటి అప్డేట్ రాలేదు. తాజాగా, నేడు కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు కావడంతో nkr 21 చిత్రం నుండి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేసి ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేశారు. ఇందులో కళ్యాణ్ రామ్ కూర్చీలో కోపంగా కూర్చొని మంటను చేతిలో పట్టుకుని వైల్డ్ లుక్‌లో కనిపిస్తున్నాడు. అలాగే చుట్టూ విలన్స్, మంటల మధ్యలో కల్యాణ్ రామ్ దర్శనమిచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ చూసిన ఫ్యాన్స్ పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.

Next Story