- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తిరుమలలో 208 దళారుల అరెస్ట్..381 మంది కోసం గాలింపు
దిశ, వెబ్ డెస్క్: తిరుమలలో దళారుల ఆటకట్టించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. టీటీడీ విభాగం నుంచి గదులు పొంది అక్రమాలకు పాల్పడిన వారిపై నిఘా పెంచారు. దళారుల అక్రమాలపై 2019 నుంచి ఇప్పటివరకూ 279 కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల్లోని నిందుతుల వివరాలను ప్రకటించారు. నకిలీ ఆధార్‌లతో గదులు, సేవా టికెట్లు పొందిన 589 మందిని గుర్తించారు. వీరిలో 208 మందిని అరెస్ట్ చేశారు. మిగిలిన 381 మంది కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులు సమర్పించిన నకిలీ ఆధార్ కార్డుల ఆధారంగా పట్టుకునేందుకు యత్నిస్తున్నారు.
కాగా రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో తిరుమల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో జరిగిన అవినీతి, అక్రమాలపై నిఘా పెట్టారు. చిన్న తప్పు దొరికినా వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో చాలా అక్రమాలు, అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. దీంతో వారందరిపై చర్యలు తీసుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది.