- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Bigg Boss: బిగ్‌బాస్‌లోకి విజయ్ కుమార్తె.. విజేతగా చరిత్ర సృష్టించనుందా?
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం తెలుగు బిగ్‌బాస్ సీజన్-8 అట్టహాసంగా సాగుతోంది. టాలీవుడ్ ప్రముఖ హీరో నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. రీసెంట్‌గా తెలుగు బిగ్‌బాస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పాత కంటెస్టెంట్లు ఏకంగా మొత్తం ఎనిమిది మంది గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఇకపోతే ఈ రియాలిటీ షో కన్నడ, తమిళ్ లో కూడా కొంతకాలం నుంచి ప్రసారమవుతోన్న విషయం తెలిసిందే. కాగా రీసెంట్ గానే (అక్టోబరు 6) తమిళ్ బిగ్ బాస్ సీజన-8 ప్రారంభమైంది. ఈ షోకు ఎప్పుడైనా కమల్ హాసన్ హోస్టింగ్ చేసేవారు కానీ ఈసారి ఆయన షూటింగ్ లో బిజీగా ఉండడం వల్ల విజయ్ సేతుపతి హోస్టింగ్ చేస్తున్నారు.
అయితే ఈ బిగ్‌బాస్ లో ఏకంగా 18 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. సచన నమిదాస్, దర్శ గుప్తా, నిర్మాత రవీంద్ర చంద్రశేఖరన్, సత్య, దీపక్, జెఫ్రీ, రంజిత్, RJ అనంతి, సునీత గొగోయ్, పవిత్ర జనని, సౌందర్య, అర్ణవ్, ముత్తుకుమారన్, అరుణ్ ప్రశాంత్, తర్షిక, VJ విశాల్, అన్శిదా, జాక్వెలిన్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో మన తెలుగు వారు కూడా ఉండటం విశేషం. ఒకరు ప్రొడ్యూసర్ రవీంద్ర చంద్రశేఖర్, మరోకరు చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించిన నమిదాస్. ఈమె రీసెంట్ గా వచ్చిన విజయ్ సేతుపతి నటించిన మహారాజా చిత్రంలో విజయ్ కు కుమార్తెగా నటించి.. ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో హీరో విజయ్ కుమార్తె టైటిల్ విన్నర్ కావాలంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికన సందడి చేస్తున్నారు.