- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
క్రేజీ కాంబినేషన్.. మరోసారి జత కట్టనున్న సమంత, సిద్ధార్థ్?
దిశ, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ముద్దుగుమ్మ ఏమాయ చేసావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి.. స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగింది. ఇక అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకొని, మనస్పర్థల కారణంగా విడిపోయిన విషయం తెలిసిందే. వీరు విడిపోయాక సోషల్ మీడియాలో అనేక రూమర్స్ పుట్టుకొచ్చాయి. ముఖ్యంగా హీరో సిద్ధార్థ్, సమంత లవ్ చేసుకున్నారని, ఆ తర్వాత సామ్ సిద్ధుకు హ్యాండ్ ఇచ్చి చైతూని పెళ్లి చేసుకుందని, వీరు విడిపోవడంతో సిద్ధూ చాలా హ్యప్పీగా ఫీలైనట్లు, టాలీవుడ్‌లోని పలువురికి పార్టీ కూడా ఇచ్చినట్లు నెట్టింట్లో గుస గుసలు వినిపించాయి.
ఈ క్రమంలో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. సంవత్సరం పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత, మళ్లీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సిద్ధార్థ్,సమంత కలిసి సినిమా చేయబోతున్నట్లు సమాచారం. వీరిద్దరి కాంబినేషన్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఉంటుదని ఓ డైరెక్టర్ మంచి సినిమా కోసం వీరిని సంప్రదించాడంట. వీరికి కథ కూడా వినిపించాడంట. ఇక కథ బాగుండే సరికి సమంత ఒకే చెప్పేసిందంట. ఇక సామ్‌తో నటించడానికి సిద్ధు కూడా ఓకే చెప్పడంతో.. వీరిద్దరి కాంబినేషన్‌లో త్వరలో మూవీ రానున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ, ఈ వార్త నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది.