- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
మాల్స్‌లో గడియారాలు ఎందుకు ఉండవో తెలుసా? దీని వెనకున్న స్టోరీ ఇదే!
దిశ, ఫీచర్స్: కొంతమంది షాపింగ్ మాల్స్‌కు వెళ్తే పని తొందరగా ఫినిష్ చేసుకుని వస్తారు. మరికొంతమంది గంటల తరబడి షాపింగ్ చేస్తారు. కొన్నిసార్లు మీరు మాల్ మూసే వరకు అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడున్న సిబ్బంది కస్టమర్లను సార్/మేడమ్ టైం అయిపోయింది వెళ్లండని బలవంతంగా బయటకు పంపించేస్తారు.
ఇలా ఎందుకు జరుగుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? మీరు మాల్‌లో మీకు తెలియకుండానే ఎంత టైం స్పెండ్ చేస్తున్నారో ఎప్పుడు థింక్ చేశారా? ఇప్పుడు తెలుసుకుందాం..
అయితే మాల్‌లో గోడలపై గడియారాలు ఉండవు. కేవలం జనాల్ని ఆకర్షించే డిజైన్లు, అలంకరణ వస్తువులు మాత్రమే పెడతారు. ఒకవేళ గడియారాలు పెట్టినా టైమ్ సరియైన సమయం చూపవు. అన్నీ వేర్వేరు టైమింగ్‌ను చూపుతాయి. దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి? గడియారానికి మీకు, వారి బిజినెస్‌కు సంబంధం ఏంటి అంటే..
ఎవరైనా సరే ఏదైనా ఒక వస్తువు కొనలాని ప్లానింగ్‌తో వెళ్తారు లేదా జస్ట్ టైమ్ పాస్ కు వెళ్తారు. ఇలా మాల్‌లోకి ప్రవేశించగానే కంపెనీల ప్రొడక్ట్స్, వాటి ఆఫర్లను చూసి ఒక్కోక్కటిగా కొంటూ బయటకు వస్తారు. మాల్‌లో ఎక్కువసేపు ఉన్నట్లైతే మీ కళ్ళు ఒకదానిపై ఒకటి పడతాయి. ఆ వస్తువు అవసరం లేకపోయినా దాని ప్రైస్ కచ్చితంగా చెక్ చేస్తారు. ముఖ్యంగా అలంకార వస్తువులు, విలాస వస్తువుల ధరలను సెర్చ్ చేయడం అందరికీ అలవాటు.
ఈ కారణంగా మాల్స్‌లో ఎక్కువ టైమ్ గడిపేలా చేస్తారు. అదే మాల్‌లో గడియారం కనుక ఉంటే మీరు దానివైపు చూసే చాన్సెస్ ఉంటాయి. దీంతో అమ్మో మనమొచ్చి చాలా సేపు అవుతుందిగా వెళ్లాలి అనే ఆలోచన వస్తుంది. మాల్‌లో గడియారం చూస్తే మీ దృష్టి మరలుతుంది. పెద్ద గడియారంలో సమయం చూస్తే ఇంట్లో పని గుర్తుకు వస్తుందనేది లోతైన మానసిక అంశం. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని బంగోర్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకుల ప్రకారం చూసినట్లైతే..
ప్రజలు షాపింగ్ చేసినప్పుడు, సందేహాస్పదమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోకూడదు. మన మెదడు మనల్ని ఆపగలిగే సామర్థ్యాన్ని 20 నిమిషాల వరకే ఉంచుకుంటుంది. అంటే మనం ఇన్ని డబ్బులతో ఈ ఐటెమ్ కొనాలనుకుంటే 20 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి. ఒకే నిర్ణయం గురించి 20 నిమిషాల కంటే ఎక్కువ ఆలోచిస్తే, మీ ఆర్థిక నిర్ణయం దెబ్బతింటుంది. అప్పుడు మీ మెదడు ఆర్థిక విషయాలపై నియంత్రణ కోల్పోతుంది.