చదువుకుంటూనే రూ. 500 కోసం అలాంటి పని చేశా.. సమంత ఎమోషనల్ కామెంట్స్!

by Hamsa |   ( Updated:2024-01-09 08:38:23.0  )
చదువుకుంటూనే రూ. 500 కోసం అలాంటి పని చేశా.. సమంత ఎమోషనల్ కామెంట్స్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొద్ది కాలంగా ఇండస్ట్రీకి దూరమైంది. గత కొద్ది కాలంగా మయోసైటీస్‌కు ట్రీట్‌మెంట్ తీసుకుంటూ ఇంట్లోనే ఉంటుంది. సినిమాల్లో నటించకపోయినా పలు యాడ్స్‌తో చేతినిండా డబ్బు సంపాదిస్తోంది. తాజాగా, ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత తన లైఫ్‌లో జరిగిన కొన్ని సంఘటనల గురించి చెబుతూ ఎమోషనల్ అయింది. ‘‘ చిన్నతనం నుంచి చదువుకోమని అమ్మానాన్న చెప్పేవారు. నేను కూడా చదువు మీదే దృష్టి పెట్టాను. కానీ కుటుంబ పరిస్థితులు సహకరించకపోవడంతో ఏ పని దొరికితే అది చేశా. నేను చదువుకుంటున్న రోజుల్లో ఒకస్టార్ హోటల్‌లో జరిగిన ఈవెంట్‌కు వర్క్ చేశాను. అందుకు నాకు రూ. 500 ఇచ్చారు. అదే మొదటి సంపాదన’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సమంత చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement

Next Story