నటిని లోదుస్తులతో.. 'బిగ్ బాస్ 16'లో దారుణం..

by samatah |   ( Updated:2022-11-03 11:07:23.0  )
నటిని లోదుస్తులతో.. బిగ్ బాస్ 16లో దారుణం..
X

దిశ, సినిమా : 'బిగ్ బాస్ 16' లోపల ఇంటి సభ్యుల గొడవల కన్నా.. బయటే కంటెస్టెంట్ సపోర్టర్స్ మధ్య ఎక్కువ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే టీవీ నటి టీనా దత్తా- షాలిన్ భానోట్‌ ప్రేమాయణం కొందరిని బాధపెడుతుండగా.. తాజాగా తనను తాను బ్రాండ్‌గా ప్రకటించుకోవడంపై యాక్టర్ విశాల్ కోటియన్ దారుణంగా స్పందించాడు. 'ఇంతకీ నువ్వు ఏ బ్రాండ్?' అని ప్రశ్నించిన ఆయన.. ఆమెను 'రూప' లోదుస్తుల బ్రాండ్‌తో పోల్చాడు. రియాలిటీ షోకు వచ్చి స్టార్స్‌లాగా యాక్ట్ చేయడం కాదు, రియల్‌గా ఉండాలని విమర్శించాడు. కాగా దీనిపై స్పందిస్తున్న నెటిజన్స్.. 'ఒక మహిళను పబ్లిక్‌గా ఇంత సులభంగా డీగ్రేడ్ చేయడాన్ని మీ సంస్కారానికే వదిలేస్తున్నాం. అది కూడా ఇండస్ట్రీ నుంచి వచ్చిన నీలాంటి వారు ఇలాంటి స్టేట్‌మెంట్స్ ఇవ్వడం దారుణం. ఆమె ఈ రోజు ఈ పొజిషన్‌లో ఉండేందుకు కారణం కష్టపడేతత్వం కాదా. అలాంటప్పుడు ఆమె బ్రాండ్‌గా ఎందుకు పరిగణించబడదు. ఇంతకీ నీ సీజన్‌లో నువ్వు రియల్‌గా ఉన్నావా? ఉంటే నీ ఫ్యాన్స్ మద్దతు కూడా ఎందుకు పొందలేకపోయావు? షమితా శెట్టి వెనకాలే ఉండిపోయిన నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడటం నవ్వు తెప్పిస్తుంది' అని విమర్శించారు.

Read more :

1.పింక్ డ్రెస్‌లో సెక్సీ సింగర్.. కనుబొమ్మలెగరేస్తూ కవ్విస్తోంది!!

Advertisement

Next Story