ఆస్కార్‌ రేసులో NTR.. Vijay Deverakonda అనూహ్య కామెంట్స్

by sudharani |   ( Updated:2022-08-20 07:10:54.0  )
ఆస్కార్‌ రేసులో NTR.. Vijay Deverakonda అనూహ్య కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా తాజాగా తెరకెక్కుతున్న సినిమా 'లైగర్'. విడుదల సమయం దగ్గర పడటంతో ప్రమోషన్స్‌లో బిజీ అయ్యింది మూవీ టీం. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో విజయ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌పై సంచనల కామెంట్స్ చేశారు.

డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచాన్ని షేక్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో తారక్, రామ్ చరణ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. హాలీవుడ్ స్టార్ హీరోలు, దర్శకుల సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తు్నారు. ఇక ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ ఆస్కార్ ఆవార్డుకు నామినేట్ అవుతారు అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే విజయ్ దేవరకొండ ఓ ఇంటర్వ్యూలో ఈ వార్తలపై స్పందిస్తూ.. ''ఆర్ఆర్ఆర్ మూవీలో ఎన్టీఆర్, రాంచరణ్ ఇద్దరూ డెడ్లీ పెర్ఫామెన్స్ ఇచ్చారు. ఒక వేల తారక్ అన్న ఆస్కార్ గెలిస్తే మెంటల్ అసలు. మన దేశానికి ఆస్కార్ వస్తే ఆ హై వేరుగా ఉంటుంది. అదే కనుక జరిగితే ఒక మ్యాజిక్ లాగా చాలా బాగుంటుంది'' అంటూ విజయ్ ఆసక్తిర వ్యాఖ్యలు చేశాడు.

Also Read: 'సల్మాన్ ఖాన్‌ ఎంత శాడిస్టో మీకు తెలియదు'..

Advertisement

Next Story