- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భార్యాభర్తలు.. కానీ ఇద్దరికీ అక్రమ సంబంధాలు
దిశ, సినిమా: విక్కీ కౌశల్, కియారా అద్వానీ, భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రల్లో వస్తున్న 'గోవింద నామ్ మేరా' విడుదలకు రంగం సిద్ధమైంది. థియేటర్స్‌కు బదులు ఓటీటీ రిలీజ్‌ను ఎంచుకున్న నిర్మాత కరణ్ జోహార్.. తమ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా విక్కీతో కలిసి డిస్కస్ చేసిన ఫన్నీ వీడియోను యూట్యూబ్ వేదికగా రిలీజ్ చేశాడు. 3 నిమిషాల నిడివిగల వీడియోలో కరణ్ సినిమా స్టోరీ చెబుతుంటే ప్రతి సన్నివేశాన్ని హై రేంజ్లో ఊహించుకుంటాడు విక్కీ.
లవ్ స్టోరీ అనగానే స్విట్జర్లాండ్ అంటూ మురిసిపోవడం, ఆ వెంటనే కాదు ముంబాయి గల్లీలోనే అంటూ కరణ్ షాకిచ్చే అంశాలతో సరదాగా కొనసాగింది. ఈ క్రమంలోనే 'గోవిందకు పెళ్లయింది. కానీ, అతని భార్య తన ప్రియుడిని ప్రేమిస్తుంది. గోవిందకు కూడా ఒక స్నేహితురాలు ఉంది' అని చెప్పడంతో ఒక్కసారిగా దిక్కుతోచని ఫీలింగ్‌తో విక్కీ డిజప్పాయింట్ అవ్వడం నవ్వులు పూయించింది. ఇక శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ డిస్నీ + హాట్‌స్టార్‌లో విడుదలవనుండగా రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు.