తన భార్య ప్లేస్‌లో ఆ హీరోయిన్‌ను ఊహించుకుంటున్న స్టార్ హీరో

by samatah |
తన భార్య ప్లేస్‌లో ఆ హీరోయిన్‌ను ఊహించుకుంటున్న స్టార్ హీరో
X

దిశ, సినిమా : బాలీవుడ్ యంగ్ బ్యూటీ షెహనాజ్ గిల్‌పై నటుడు విక్కీ కౌశల్ ప్రశంసలు కురిపించాడు. 'గోవింద నామ్ మేరా' మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా షెహనాజ్ హోస్ట్ చేస్తున్న 'దేశీ వైబ్స్ విత్ షెహనాజ్ గిల్' చాట్‌ షోకు హాజరైన విక్కీ.. ఆమెను 'పంజాబ్ కీ కత్రినా కైఫ్' అంటూ పొగిడేశాడు. ఇక ఈ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన నటి.. 'మీలో ఒకరిగా భావించే వ్యక్తులు చాలా అరుదుగా కలుస్తారు. వాళ్లు చాలా కాలం తర్వాత కలిస్తే చెప్పలేని అనుభూతి పొందుతారు. నిజమైన స్టార్ అంటే ఇలాగే ఉంటారని అనుకుంటున్నా. విక్కీ మిమ్మల్ని కలిసినందుకు సంతోషిస్తున్నా. మీరెప్పుడూ విజయం, ఆరోగ్యం, సానుకూలత కలిగి ఉండాలని కోరుకుంటున్నా. ''గోవిందా నామ్ మేరా'కు ఆల్ ది బెస్ట్. మీ సినిమా సూపర్‌హిట్ అవుతుంది' అంటూ రాసుకొచ్చింది. కాగా దీనిపై స్పందిస్తున్న నెటిజన్స్.. అంటే తన భార్య కత్రిన ప్లేస్‌‌లో షెహనాజ్‌ను ఊహించుకుంటున్నాడా అని కామెంట్ చేస్తున్నారు.

Advertisement

Next Story