Nagarjuna తో కొట్లాటకు దిగిన Venkatesh..

by Aamani |   ( Updated:2023-09-20 14:48:14.0  )
Nagarjuna తో కొట్లాటకు దిగిన Venkatesh..
X

దిశ, సినిమా: టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలో విక్టరీ వెంకటేష్ కూడా ఒకరు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఈయనకి ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఇండియాలో ఏ హీరోకి కూడా లేదు. వ్యక్తిగతంగా కూడా ఆయన చాలా కూల్‌గా ప్రతి హీరోతో ఎంతో క్లోజ్‌గా ఉంటాడు. అలాంటి వెంకటేష్ గురించి ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వెంకటేష్ ఒకానొక సమయంలో తన చెల్లి విషయంలో నాగార్జునతో గొడవపడ్డాడంటా. విషయంలోకి వెళితే.. వెంకటేష్ చెల్లెలు లక్ష్మి దగ్గుబాటిని నాగార్జున పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరిది పెద్దలు కుదిరించిన వివాహం. అప్పట్లో అక్కినేని నాగేశ్వర్ రావు, రామా నాయుడు మధ్య ఉన్న సాన్నిహిత్యం కారణంగా నాగార్జునకి తన కూతురిని ఇచ్చి పెళ్లి చేశాడు.

కానీ కొంత కాలానికి నాగ చైతన్య పుట్టిన తర్వాత, ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడి విడిపోయారు. కానీ వీరిద్దరు విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు నాగార్జున, లక్ష్మిని కలపాలని వెంకటేష్ చాలా ప్రయత్నం చేశాడట. ఇక లక్ష్మికి కలవాలని ఉన్నప్పటికీ , నాగార్జునకు మాత్రం లేదు. ఎందుకంటే అప్పటికే ఆయన ప్రముఖ హీరోయిన్ అమలతో ప్రేమలో ఉన్నాడట. ఈ విషయం తెలుసుకున్న వెంకటేష్‌కి కోపం కట్టలు తెంచుకుని.. నాగార్జునతో ఒక రేంజ్‌లో గొడవకు దిగాడంట. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి : సామ్, చైతన్య మళ్లీ కలవనున్నారా..! సమంత చేసిన పనికి బుర్ర బద్దలుకొట్టుకుంటున్న నెటిజన్లు..?

Advertisement

Next Story