డబ్బులు సంపాదించడానికి ఈ పని చేయట్లేదు.. నేను ఆ టైపు కాదు

by Prasanna |   ( Updated:2023-11-05 14:23:30.0  )
డబ్బులు సంపాదించడానికి ఈ పని చేయట్లేదు.. నేను ఆ టైపు కాదు
X

దిశ, సినిమా: కాబోయే భాగస్వామి ఎలాంటి లక్షణాలు కలిగివుండాలో బయటపెట్టింది నటి వేదిక కుమార్. చాలా కాలంగా ఇండస్ట్రీలో ఉంటున్న ఈ అమ్మడు వరుస ఆఫర్లు దక్కించుకోలేకపోయినా అందివచ్చిన ప్రతి సినిమా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నట్లు తెలిపిన హాటీ తన పర్సనల్ అండ్ కెరీర్ అనుభవాలతోపాటు పెళ్లి గురించి కూడా మాట్లాడింది.

ఈ మేరకు ‘బాల్యంలోనే నటిని కావాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా. ముని, పరదేశి, కాంచన-3 మంచి గుర్తింపునిచ్చాయి. ఇక ఇండస్ట్రీలో ఒక్కొక్కరికీ ఒక్కో డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ఉంటుంది. నాకు మాత్రం అన్నీ డ్రీమ్‌ ప్రాజెక్టులే. నేను డబ్బు కోసం సినిమాలు చేయడం లేదు. కీర్తి ప్రతిష్ఠలే ముఖ్యం. ఎప్పటికీ నిలిచి ఉండేది పేరే. పరిశ్రమలో నాకంటూ ఓ స్థానం, గుర్తింపు కావాలి. కాబట్టి నటిగా ఎక్కువగా రోజులు కొనసాగాలంటే ఫిట్‌నెస్‌ కాపాడుకోవాలి. రోజూ జిమ్‌, యోగా చేస్తా. అలాగే నాజూకుగా ఉండాలని నోరు కట్టేసుకునే రకం కాదు నేను. భారతీయ వంటకాలను ఇష్టంగా తింటాను. అమితాబ్‌ బచ్చన్‌, శ్రీదేవి నటన ఇష్టం. నా అభిమాన డైరెక్టర్‌ మణిరత్నం’ అని చెప్పింది. ఇక జీవిత భాగస్వామిలో తాను ప్రధానంగా కోరుకునేది ప్రశాంతతనే అని చెప్పిన బ్యూటీ అందరినీ ప్రేమగా చూసుకోవడంతోపాటు ఇంటెలిజెంట్‌‌గా ఉండాలని పేర్కొంది. చివరగా ‘ప్రేమ అంటే ఏమిటో కచ్చితంగా నిర్వచించలేను. కానీ ఈ సృష్టిలో అన్నిటికన్నా స్వచ్ఛమైనది అమ్మ ప్రేమే’ అంటూ చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story