Breaking: శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో వాటర్ లీకేజ్

by srinivas |
Breaking: శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో వాటర్ లీకేజ్
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీశైలం(Srisailam) ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రం(Hydroelectrict Centre)లో వాటర్ లీకేజ్(Water leakage) అవుతోంది. ఒకటవ యూనిట్ డ్రాఫ్ట్ ట్యూబ్ జీరో ఫ్లోర్ నుంచి వారం రోజులుగా నీళ్లు కారుతున్నాయి. పంప్ మోడ్ టర్బైన్ వేగంగా తిరగడమే కారణమని అధికారులు అంటున్నారు. నీటి లీకేజీని ఆపకపోతే ఫోర్స్ స్లాబ్ పడిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అంతేకాదు ఇందుకు సంబంధించిన నివేదికను రెడీ చేస్తు్న్నారు. ఈ లీకేజ్ వల్ల డ్యామ్‌కు ఎటువంటి ప్రమాదం ఉండదని స్పష్టం చేశారు. అయితే నెల రోజులుగా కరెంట్ ఉత్పత్తి అవుతోంది. దీంతో పంప్ మోడ్ పద్ధతిలో శ్రీశైలం డ్యాంలోకి నీటిని మళ్లిస్తున్నారు. దానికి సంబంధించిన టర్బైన్స్ స్పీడుగా తిరగడంతో నీళ్లు లీకేజీ అవుతున్నాయని అధికారులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed