Union Cabinet : రైతులకు కేంద్ర కేబినెట్ గుడ్ న్యూస్

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2025-01-01 10:50:12.0  )
Union Cabinet : రైతులకు కేంద్ర కేబినెట్ గుడ్ న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్ : నూతన సంవత్సరం(New Year)లో తొలిసారిగా సమావేశమైన ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) నేతృత్వంలోని కేంద్ర కేబినెట్‌(Union Cabinet) రైతుల(Farmers)కు తీపి కబురు(Good News)అందించింది. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. డీఏపీ ఎరువుపై రైతులకు ఇచ్చే సబ్సిడీ(DAP subsidy)ని మరింత పెంచాలని కేబినెట్ నిర్ణయించింది. డీఏపీపై అదనపు భారాన్ని కేంద్రమే భరించనుంది. ఇకపై ఒక 50 కిలోల డీఏపీ బస్తా రూ.1350 కే లభ్యం కానుంది. కేంద్రం తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా 4 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇందుకు రూ.3,850కోట్ల ప్రత్యేక ప్యాకేజీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

అదే విధంగా పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం(PM Kisan Increase) కింద అందించే మొత్తాన్ని ఇక మీదట రూ.6 వేల నుంచి రూ.10 వేలకు పెంచాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.కోట్లు విడుదు చేశారు. ఫసల్ బీమా యోజన పథకం పరిధి పెంచుతూ నిధిని రూ.69,515 కోట్లకు పెంచుతూ కేబినెట్ నిర్ణయించింది. 2025ను రైతు ఏడాది సంక్షేమ ఏడాదిగా నిర్ణయించినట్లుగా తెలిపారు. రైతులకు కేంద్రమే పంట నష్టం చెల్లించాలని నిర్ణయించింది. డిజిటల్ రిమోట్ సెన్సింగ్ విధానం ద్వారా పంట నష్టంను గుర్తిస్తారు. ఇందులో 23 రాష్ట్రాలు, 4కేంద్ర పాలిత ప్రాంతాలు భాగస్వామ్యం, ఈశాన్య రాష్ట్రాలకు 90శాతం మిగిలిన రాష్ట్రాలకు 50శాతం నిధులు భరించాలని నిర్ణయించింది.

అదేవిధంగా ‘ఫండ్‌ ఫర్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ టెక్నాలజీ’కి కేంద్రం రూ.800 కోట్ల నిధిని ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న పలు ముఖ్యమైన ప్రాజెక్టులపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదనలపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. నిరుద్యోగులకు ప్రత్యేక శిక్షణ అందించేందుకు ఓ ప్రత్యేక టీమ్‌ ఏర్పాటు చేయాలని కూడా సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed