Ponnam: గురుకుల పాఠశాలలో మంత్రి పొన్నం ఆకస్మిక తనిఖీ

by Ramesh Goud |
Ponnam: గురుకుల పాఠశాలలో మంత్రి పొన్నం ఆకస్మిక తనిఖీ
X

దిశ, వెబ్ డెస్క్: సికింద్రాబాద్(Secundarabad) లాలాపేటలోని(Lalapeta) మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) ఆసక్మికంగా తనిఖీ(checking) చేశారు. ఈ సందర్భంగా మంత్రి విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి, పాఠశాలలోని సమస్యలపై విద్యార్థులను ఆరా తీశారు. అలాగే ప్రభుత్వం 40 శాతం డైట్ చార్జీలు(Diet charges) పెంచిందని చెబుతూ.. విద్యార్థులకు అందుతున్న భోజనం గురించి అడిగి తెలుసుకున్నారు. అంతేగాక విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని, ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇక పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు దగ్గర పడుతున్నాయని విద్యార్థులకు సూచిస్తూ.. అందరూ బాగా చదువుకోని తల్లిదండ్రులకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకొని రావాలని పొన్నం సూచించారు.

Advertisement

Next Story

Most Viewed