- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వివాహానికి ముందే ఆ పని ఫినిష్ చేసిన వరుణ్ తేజ్.. స్పీడ్ మామూలుగా లేదుగా!
దిశ, వెబ్‌డెస్క్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఓ వైపు పెళ్లి పనులు చూసుకుంటూనే మరోవైపు వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఫ్లాప్, హిట్లతో సంబంధం లేకుండా వరుణ్ సినిమాలు చకచకా కంప్లీట్ చేస్తున్నాడు. రీసెంట్‌గా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ‘గాంఢీవధారి అర్జున’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. కానీ ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద పెద్దగా ఆడలేదు. ప్రస్తుతం ‘మట్కా, ఆపరేషన్ వాలంటైన్’ మూవీల్లో నటిస్తున్నారు.
కాగా సర్ప్రైజింగ్‌గా ‘ఆపరేషన్ వాలంటైన్’ సినిమా షూటింగ్ తాజాగా కంప్లీట్ అయినట్లు చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో అనౌన్స్ చేసింది. మూవీ టీం మొత్తం ఉన్న ఓ ఫొటో షేర్ చేసి.. గుమ్మడికాయ కొట్టేసినట్లు ప్రకటించారు. కాగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో వచ్చే ఈ సినిమాలో శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించగా.. ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్ ఇందులో కథానాయికగా నటిస్తోంది.
ఈ చిత్రం డిసెంబరు 8 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందని తాజాగా వరుణ్ తేజ్ ట్వీట్ చేశాడు. దీంతో జనాలు వరుణ్ పెళ్లికి ముందే ఓ పని పూర్తి చేశాడుగా అంటూ కామెంట్లు పెడుతున్నారు.