పాకిస్తాన్ నటి పెళ్లి దుస్తులపై వివాదం.. ఇండియన్ స్టైల్ అంటూ..

by Harish |   ( Updated:2023-02-28 14:16:03.0  )
పాకిస్తాన్ నటి పెళ్లి దుస్తులపై వివాదం.. ఇండియన్ స్టైల్ అంటూ..
X

దిశ, సినిమా:పాకిస్థానీ నటి ఉష్నా షా తన పెళ్లి దుస్తులపై వస్తున్న విమర్శలను తిప్పి కొట్టింది.ఇటీవలే గోల్ఫ్ ప్లేయర్ హంజా అమీన్‌ను వివాహమాడిన నటి.. పాకిస్తానీ బ్రాండ్ వార్దా సలీమ్ రూపొందించిన పెళ్లి దుస్తులు ‘ఎరుపు రంగు లెహంగా’ ధరించడం చర్చనీయాంశమైంది. ఈ మేరకు కొంత మంది నెటిజన్లు.. ‘భారత వధువు లాంటి లెహంగా’, ‘ఇండియన్ కల్చర్‌ను పాకిస్తానీయులు కించపరుస్తున్నారు’ అంటూ ట్రోలింగ్‌కు దిగారు.

కాగా ఆ నెగెటీవ్ కామెంట్స్‌ను ఉద్దేశిస్తూ తాజాగా నెట్టింట ఓ పోస్ట్ షేర్ చేసిన ఉష్నా.. ‘మిసెస్ అమీన్.. నా దుస్తులను సమస్యగా ఫీల్ అవుతున్న వారికోసమే చెబుతున్నా. నేను ఎలాంటి బట్టలేసుకోవాలో మీరు సూచించాల్సిన అవసరం లేదు. నా దుస్తుల కోసం మీరెవరూ డబ్బులు చెల్లించలేదు. నా ఆభరణాలు, దుస్తులు పూర్తిగా పాకిస్థానీ. నా హృదయం సగం ఆస్ట్రియన్. దేవుడు మన అందరినీ సంతోషంగా ఉంచాలని ఆశిస్తున్నా. మా పెళ్లికి వచ్చిన ఆహ్వానం లేని ఫొటోగ్రాఫర్‌లకు నా శుభాకాంక్షలు’ అంటూ చురకలంటించింది.

Advertisement

Next Story

Most Viewed