అల్లుడి కోసం అత్త ప్రత్యేక పూజలు: ఊర్వశి తల్లి మీరా పోస్ట్‌పై ట్రోలింగ్

by Prasanna |   ( Updated:2023-01-03 09:06:46.0  )
అల్లుడి కోసం అత్త ప్రత్యేక పూజలు: ఊర్వశి తల్లి మీరా పోస్ట్‌పై ట్రోలింగ్
X

దిశ, సినిమా: ఇటీవల కారు ప్రమాదానికి గురైన భారత క్రికెటర్ రిషబ్ పంత్‌ కోసం ఊర్వశి రౌతేలా 'ప్రేయింగ్' అంటూ పోస్ట్ పెట్టి విమర్శలు ఎదుర్కొంది. అయినా సరే ఏ మాత్రం తగ్గకుండా ఊర్వశి తల్లి మీరా కూడా రిషబ్ త్వరగా కోలుకోవాలని పోస్ట్ పెట్టింది. 'ఒకవైపు సోషల్ మీడియా పుకార్లు..మరోవైపు మీ ఆరోగ్యం బాగుండాలని నేను కోరుకోవడం కష్టమైన పనే. ఏదేమైనా మీ కారణంగా ఉత్తరాఖండ్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుపొందింది. కాబట్టి సిద్ధబలి బాబా మీపై ప్రత్యేక ఆశీస్సులు కురిపిస్తాడు. అందరూ ఆయన కోసం ప్రార్థించాలి' అంటూ రిషబ్ పంత్ ఫొటోను జతచేసింది. ఇక దీనిపై స్పందింస్తున్న నెటిజన్లు..'అల్లుడికోసం అత్త ప్రత్యేక పూజలు', 'ఈ కారణంతో పంత్‌ను బుట్టలో వేసుకోవాలని తల్లీకూతుళ్లు చూస్తున్నారా? 'ఊర్వశి నిజమైన ఐడీతో రా', 'ఈ మానవత్వం మీ కూతురిలో కూడా ఉండాలని కోరుకుంటున్నాం' అంటూ భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story