ఆవు పేడతో చేసిన డ్రెస్ వేసుకున్న ఉర్ఫీ.. నెట్టింట తీవ్రవిమర్శలు

by samatah |   ( Updated:2023-05-20 13:32:01.0  )
ఆవు పేడతో చేసిన డ్రెస్ వేసుకున్న ఉర్ఫీ.. నెట్టింట తీవ్రవిమర్శలు
X

దిశ, సినిమా : ‘కాదేది కవితకు అనర్హం’ అని ఓ గొప్ప కవి చెప్తే.. ‘కాదేది ఫ్యాషన్‌కు అనర్హం’ అంటోంది ఉర్ఫీ జావేద్. ఈ క్రమంలోనే చెట్టు బెరడు నుంచి తయారు చేసిన డ్రెస్‌ను వేసుకున్న ఆమె.. ఈ అవుట్‌ఫిట్ తయారు చేసే సమయంలో ఏ చెట్టుకు హానిజరగలేదని ముందే చెప్పింది. అయితే దీనిపై స్పందించిన నెటిజన్స్.. డ్రెస్ ఆవు పేడతో తయారు చేసినట్లుగా అనిపిస్తుందని విమర్శిస్తున్నారు. ‘నువ్వు అంత క్రియేటివ్ ఫ్యాషన్ సెన్స్ కలిగి ఉంటే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఎందుకు లేవు?’ అని ప్రశ్నిస్తున్నారు. ఇక నెట్టింట భారీ ఫాలోయింగ్ పొందుతున్న ఉర్ఫీ.. తాజాగా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిపై ఫైర్ అయింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఐశ్వర్యా రాయ్‌కు కాస్ట్యూమ్ స్లేవ్స్ హెల్ప్ చేయడాన్ని తప్పుపట్టడంతో ఐశ్వర్యకు మద్దతుగా నిలిచింది బ్యూటీ.

Also Read.; హైదరాబాద్‌లో ఇల్లు కొన్న ‘సీతారామం’ హీరోయిన్ మృణాల్

Advertisement

Next Story

Most Viewed