బిగ్‌బాస్ హౌస్‌‌లో ఉదయభాను?.. కళ్లుచెదిరే రెమ్యూనరేషన్!

by sudharani |   ( Updated:2022-08-10 07:01:51.0  )
బిగ్‌బాస్ హౌస్‌‌లో ఉదయభాను?.. కళ్లుచెదిరే రెమ్యూనరేషన్!
X

దిశ, సినిమా : బిగ్‏బాస్ 'సీజన్ 6' కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ప్రేక్షకుల నిరీక్షణకు మేకర్స్ ఫుల్‌స్టాప్ పెట్టారు. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 4 నుంచి గ్రాండ్‌గా ప్రారంభించనున్న ఆరో సీజన్‌లో మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ పాల్గొనబోతున్నారు. 10 మంది అమ్మాయిలు, 9 మంది అబ్బాయిలతో కూడిన జాబితాలో ఫేమస్ సెలబ్రిటీలతో పాటు యూట్యూబర్స్, బుల్లితెర నటీనటులు ఉండనున్నారు. ఈసారి ఫేమస్ యాంకర్ ఉదయభాను హౌస్‌లో అడుగుపెట్టబోతుండటం విశేషం. ఇక రెమ్యూనరేషన్స్ విషయానికొస్తే.. అందరిలోకెల్ల ఉదయభానే ఎక్కువ చార్జ్ చేయనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే ఆమె 100 రోజుల పాటు హౌస్‌లో ఉండే చాన్స్ ఉందని నిర్వాహకులు గట్టిగా నమ్ముతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్లో తనకున్న ఫాలోయింగ్‌ను బట్టే ఈ మేరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

కూతురుకు మద్యం తాగించిన టాలీవుడ్ నటి.. నువ్వు అమ్మవేనా అంటూ సెటైర్స్

Advertisement

Next Story