U/A సర్టిఫికెట్ పొందిన 'బ్రహ్మాస్త్ర'.. భారీ వసూళ్లు పక్కా అంటున్న మేకర్స్

by samatah |   ( Updated:2022-09-06 13:30:47.0  )
U/A సర్టిఫికెట్ పొందిన బ్రహ్మాస్త్ర.. భారీ వసూళ్లు పక్కా అంటున్న మేకర్స్
X

దిశ, సినిమా: రణ్‌బీర్ కపూర్, అలియా భట్ జంటగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన మూవీ 'బ్రహ్మాస్త్ర'. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా తాజాగా CBFC (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) 'UA' సర్టిఫికెట్‌ పోందినట్లు మేకర్స్ తెలిపారు. అలాగే ఈ మూవీ రన్‌టైమ్ 2 గంటల 46 నిమిషాల 54 సెకన్లు ఉంటుందని చెప్పిన నిర్మాతలు.. విడుదలైన మొదటి రోజే రూ. 20-25 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక పాన్ ఇండియా లెవల్లో సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా తెలుగులో 'బ్రహ్మాస్త్రం' పేరుతో విడుదల కానుండగా ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

Advertisement

Next Story

Most Viewed