యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు..

by Kavitha |
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు..
X

దిశ, సినిమా: జూనియర్ ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘దేవర’. అయితే ఈ సినిమా రెండు పార్టులుగా రూపొందుతుంది. సముద్రం బ్యాక్‌ డ్రాప్‌లో తీర్చిదిద్దుతున్న ఈ చిత్రం మొదటి పార్టును సెప్టెంబర్‌ 27 న గ్రాండ్‌గా రిలీజ్‌ చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. ఇందులో బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల థాయ్‌ల్యాండ్‌లో ఓ పాటను చిత్రీకరించుకుని టీమ్‌ హైదరాబాద్‌ చేరుకుంది. మరో పక్క నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. దీంతోపాటు తారక్‌ హిందీలో ‘వార్‌-2’, ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ‘డ్రాగన్’ అనే పేరు ఈ చిత్రానికి పరిశీలనలో ఉంది. మైత్రి మూవీ మేకర్స్‌ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్‌లో మొదలుకానుందని ఎన్టీఆర్‌ పుట్టినరోజున ప్రకటించిన విషయం తెలిసింది.

దేవర మూవీ పూర్తి కాగానే ప్రశాంత్ నీల్ ఈ సినిమా పనులు స్టార్ట్ చేయబోతున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మీక మంధనను తీసుకున్నట్లు గతంలో వార్తలు రాగా.. ప్రస్తుతం మరో వార్త కూడా వైరల్ అవుతోంది. అదేంటంటే బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కూడా ఈ సినిమాలో భాగం కానున్నదంట. మరీ హీరోయిన్‌గానా లేకా వేరే పాత్రనా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Advertisement

Next Story