ఆఫర్స్ వస్తుండటంతో వాటిని పెంచేసిన త్రిష..!

by samatah |   ( Updated:2023-06-18 06:38:13.0  )
ఆఫర్స్ వస్తుండటంతో వాటిని పెంచేసిన త్రిష..!
X

దిశ, సినిమా: ఈ మధ్య కాలంలో సౌత్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ భారీగా పెంచినట్లు తెలుస్తోంది. ఇందులో సీనియర్ హీరోయిన్ త్రిష కూడా ఒకరు. ప్రస్తుతం ఆమె తీసుకుంటున్న రెమ్యూనరేషన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రం ద్వారా తిరిగి పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ డమ్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ మళ్లీ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. అయితే ఈ మూవీకి త్రిష రూ.10 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ అనుకున్నట్టుగా తెలుస్తోంది. నిజానికి సినిమా ఇండస్ట్రీలో ఏళ్లు గడుస్తున్న కొద్ది హీరోయిన్ కి క్రేజ్ తగ్గిపొతుంది. కానీ త్రిష విషయంలో అలా జరగలేదు. రెండు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్న ఆమె ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకోవడం గ్రేట్ అంటున్నారు విశ్లేషకులు.

Also Read: పెళ్లికి ముందే ఆ విషయంలో తమన్నాకు కండిషన్ పెట్టిన బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మ?

Advertisement

Next Story