'ప్రేమదేశం' యువతను ఉర్రూతలూగిస్తుంది: శ్రీకాంత్ సిద్ధం

by Mahesh |
ప్రేమదేశం యువతను ఉర్రూతలూగిస్తుంది: శ్రీకాంత్ సిద్ధం
X

దిశ, సినిమా: త్రిగున్, మేఘా ఆకాష్ హీరో హీరోయిన్లుగా శ్రీకాంత్ సిద్ధం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ప్రేమ దేశం'. సిరి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై శ్రీకాంత్ నిర్మిస్తున్న సినిమాలో మధుబాల ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. అయితే ఫిబ్రవరి 3న మూవీ విడుదల కాబోతున్న సందర్భంగా మీడియాతో మాట్లాడిన డైరెక్టర్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'సినిమా తీయాలనే కోరికతో అమెరికాలో సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసి ఇండియాకు వచ్చాను.

డైరెక్షన్ పరంగా ఎవరి దగ్గర పని చేయలేదు. రెండు భిన్నమైన ప్రేమ కథల ఆధారంగా సినిమాను చిత్రీకరించాం. తల్లీకొడుకుల రిలేషన్ చక్కగా చూపించాం. ఈ ప్రేమ దేశానికి యూత్ మాత్రమే కాదు ఫ్యామీలీ మొత్తం కనెక్ట్ అవుతారు. మణిశర్మ బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో చిత్రానికి ప్రాణం పోశాడు. అప్పటి బ్లాక్ బస్టర్ 'ప్రేమదేశం' మూవీకి ఏ మాత్రం తగ్గకుండా కాలేజ్ బ్యాక్ డ్రాప్‌తో ఔట్ అండ్ అవుట్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించాం. ఆడియన్స్ అందరినీ అలరిస్తుంది' అన్నారు.

READ MORE

ఆకట్టుకుంటోన్న 'శశివదనే' కలర్‌ఫుల్ ప్రోమో!

Advertisement

Next Story

Most Viewed