ఆ సినిమా కోసం అమ్మాయిగా మారాలనుకుంటున్న టాలీవుడ్ హీరో?

by Hamsa |   ( Updated:2023-06-04 06:56:37.0  )
ఆ సినిమా కోసం అమ్మాయిగా మారాలనుకుంటున్న టాలీవుడ్ హీరో?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ‘ఫలక్‌నామా దాస్’ సినిమాతో డైరెక్టర్‌గా హీరోగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత అశోకవనంలో అర్జున కళ్యాణం, ఓరీ దేవుడా, ధమ్కీ వంటి చిత్రాల్లో నటించి ఫుల్ పాపులారిటీని దక్కించుకున్నాడు. ప్రస్తుతం విశ్వక్ నాలుగైదు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో మాస్ కా దాస్‌ కు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది. విశ్వక్ సేన్ అమ్మాయిగా మారబోతున్నాడట. ఓ కొత్త దర్శకుడితో ‘లీల’ అనే సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో విశ్వక్ లేడీ గెటప్ వేస్తున్నారని సమాచారం. ఓ సరికొత్త కథాంశంతో ప్రయోగాత్మకంగా దీనిని రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుందని సమాచారం. మరీ ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే ఈ సినిమా అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Read More: నా మైండ్ కూడా సీసీ టీవీ పుటేజ్‌ లాంటిదే : అనుపమ

Advertisement

Next Story