Shraddha: సడెన్‌గా బేబీ బంప్‌తో దర్శనమిచ్చిన టాలీవుడ్ క్రేజ్ హీరోయిన్ శ్రద్ధా.. పోస్ట్ వైరల్

by Hamsa |
Shraddha: సడెన్‌గా బేబీ బంప్‌తో దర్శనమిచ్చిన టాలీవుడ్ క్రేజ్ హీరోయిన్ శ్రద్ధా.. పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: శ్రద్ధా ఆర్య 2006లో ‘కల్వనిన్ కదాలి’ అనే సినిమాతో తమిళ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ‘గొడవ’ మూవీతో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. దీంతో వరుస ఆఫర్లు రావడంతో తెలుగులో తదితర సినిమాల్లో నటించి తన అందం, అభినయంతో కుర్రాళ్లు ఫిదా అయ్యేలా చేసింది. కానీ స్టార్ హీరోయిన్‌గా ఎదగలేకపోయింది. తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, పంజాబీ భాషల్లోనూ నటించినప్పటికీ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం రాణించలేకపోయింది.

కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఓ నేవీ ఆఫీసర్ ను పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరం అయింది. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు పెడుతోంది. తాజాగా, శ్రద్ధా బేబీ బంప్ ఫొటోలు షేర్ చేసింది. పింక్ చీరలో యూత్‌ను మంత్రముగ్దులను చేస్తోంది. ఇక ఈ పిక్స్ చూసిన వారు కొందరు షాక్ అవుతుంటే.. మరికొందరు మాత్రం సో ప్రెట్టీ, నైస్ అని కామెంట్లు పెడుతున్నారు. ప్రజెంట్ శ్రద్ధా పోస్ట్ వైరల్ అవుతోంది.

Advertisement

Next Story