Bigg Boss 8: బిగ్ బాస్ సీజన్ 8 లోకి అడుగుపెట్టనున్న టాలీవుడ్ కమెడియన్ ..!

by Prasanna |   ( Updated:2024-08-19 14:34:44.0  )
Bigg Boss 8: బిగ్ బాస్ సీజన్ 8 లోకి అడుగుపెట్టనున్న టాలీవుడ్ కమెడియన్ ..!
X

దిశ, సినిమా : టాలీవుడ్‌ లో మంచి గుర్తింపు తెచ్చుకుని కమెడియన్, హీరోగా కొనసాగుతున్న అభినవ్ గోమటం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా, తెలుగు బిగ్ బాస్ 8 లోకి ఈ హీరో కూడా వెళ్ళబోతున్నాడంటూ ఎన్నో న్యూస్ లు పాల్గొనబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం, దీనికి సంబందించిన ఓ వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది. ‘ఈ నగరానికి ఏమైంది’ మూవీతో నటుడిగా పాపులారిటీ తెచ్చుకున్న అభినవ్ ఆ తర్వాత ‘మస్తు షేడ్స్ ఉన్నాయి రా’ నీలో అన్న డైలాగ్ తో చాలా ఫేమస్ అయ్యాడు. ‘మై డియర్ దొంగ’, కిస్మత్, సేవ్ ది టైగర్స్ మూవీస్ లో హీరోగా నటించాడు.

తాజాగా, బిగ్‌బాస్‌ టీమ్‌ అభినవ్ ను కలిసినట్లు ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలాంటి వాళ్లు హౌస్ లో ఉంటే ఎంటర్ అయితే ఎంటెర్టైనమెంట్ పక్కా అంటూ అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కానీ, దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అభినవ్ గోమటం బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్తాడా? లేదనేది తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.


Read More..

Kollywood: ఆ వయస్సులో కూడా పెళ్లికి రెడీ అవుతున్న హీరో

Advertisement

Next Story