- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈ రోజు నా కూతురు ఏడ్చింది.. కానీ రేపు ఈ తల్లి శాపం తగిలి మీరు నాశనం అవుతారు: రేణు దేశాయ్ సంచలన కామెంట్స్
దిశ, సినిమా: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ అందరికీ సుపరిచితమే. ఈమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘బద్రి’ సినిమాలో నటించారు. ఆ తర్వాత ‘జానీ’ మూవీలో నటించి మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి అకీరా నందన్, ఆద్య అనే ఇద్దరు పిల్లలు పుట్టారు. కానీ కొన్ని కారణాల రీత్యా విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక పవన్‌కు విడాకులు ఇచ్చిన తర్వాత తన పని తాను చేసుకుంటున్న రేణు దేశాయ్ ఏదో ఒక రకంగా వైరల్ అవుతూనే ఉంటుంది. అకీరా, ఆద్య ప్రస్తావన వచ్చినప్పుడల్లా రేణు దేశాయ్ వాటికి సీరియస్‌గానే స్పందిస్తుంది. ఇక సోషల్ మీడియాలో పెట్టే కామెంట్స్‌కి గట్టిగానే సమాధానాలు ఇస్తుంది.
ఇదిలా ఉంటే తాజాగా ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇటీవల తన సతీమణి అనా లెజినొవా, పిల్లలు అకీరా నందన్, ఆద్యలతో సరదాగా దిగిన ఫొటో నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఫొటోపై కొందరు సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ చేయడంపై రేణు దేశాయ్ ఫైర్ అయ్యారు. మనుషులు ఎంత దారుణంగా తయారవడం సిగ్గుచేటు అంటూ ఇన్‍స్టాగ్రామ్‍లో సుదీర్ఘ పోస్ట్ చేశారు.
''ఆ ఫొటోను నేను ఏ విధంగా క్రాప్ చేస్తానని, ఎలా పోస్టు చేస్తానని మీమ్స్, జోక్‌లు చేసే వ్యక్తులూ మీకూ ఒక కుటుంబం ఉందని గుర్తుంచుకోండి. తన తల్లిని ఎగతాళి చేసేలా ఉన్న ఒక పోస్టును ఇన్‌స్టాలో చూసి నా కుమార్తె విపరీతంగా ఏడ్చింది. సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులను ఎగతాళి చేసే మీకూ ఇంట్లో తల్లి, అక్కాచెల్లెళ్లు, కూతుర్లు ఉంటారని గుర్తుంచుకోండి. ప్రముఖ వ్యక్తులకు సంబంధించిన సోషల్‌మీడియా, ఇంటర్నెట్ అకౌంట్లను సులభంగా యాక్సెస్ చేసి, విచక్షణ లేని వ్యక్తులుగా ఎదుగుతున్న తీరును చూస్తుంటే నిజంగా అసహ్యం వేస్తోంది.
ఈ రోజు నా కుమార్తె ఎంతో బాధ అనుభవించింది. ఆమె కన్నీళ్లు కర్మ రూపంలో మిమ్మల్ని వెంటాడతాయని గుర్తుంచుకోండి. పొలినా, మార్క్ (అన్నా లెజినోవా, పవన్ కళ్యాణ్ పిల్లలు) సైతం ఇలాంటి విచక్షణ లేని కామెంట్లు, మీమ్స్‌తో ప్రభావితం అవుతారు. ఇలాంటి మీమ్ పేజీలను నిర్వహించేవారు సమాజంలో అత్యంత భయంకరమైన వ్యక్తులు. ఈ తల్లి శాపం మీకు కచ్చితంగా తగులుతుంది. ఈ పోస్ట్ చేయడానికి ముందు 100 సార్లు ఆలోచించా.. కానీ నా కూతురు అనుభవించిన బాధను వ్యక్తం చేసేందుకు చెప్పాల్సి వచ్చింది" అని రేణు దేశాయ్ తన ఇన్‍స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కాగా పవన్ కల్యాణ్ ఇటీవలే ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి ఇంటికి వెళుతున్న సమయంలో మార్గ మధ్యలో ఆగి అకీరా, ఆద్యతో కలిసి పవన్, అన్నా లెజినోవా ఫోటో దిగారు.