- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓటీటీలోకి వచ్చేస్తున్న షారుఖ్ ‘జవాన్’ ఆ సీన్లు కూడా యాడ్ చేస్తున్నారట..
దిశ, సినిమా: బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘జవాన్’. భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 7న హిందీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా రూ.1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టించింది. ఇక తాజాగా ఈ చిత్రం ఓటీటీ విడుదలపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సుమారు రూ. 250 కోట్లు వెచ్చించి మరీ ‘జవాన్’ని డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకోగా.. నవంబర్ 2 నుంచి స్ట్రీమింగ్ కానుందని సమాచారం.
దీని గురించి అధికారికంగా ప్రకటన రానప్పటికీ షారుఖ్ ఖాన్ బర్త్ డే సందర్భంగా అభిమానులకు గిఫ్ట్‌గా ‘జవాన్’ OTT రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారని టాక్. మరొక విషయం ఏంటంటే థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలో లేని మరికొన్ని సన్నివేశాలు యాడ్ చేసి ఓటీటీలో విడుదల చేయనున్నారని తెలుస్తుంది. ఇక మొత్తానికి షారుఖ్ తన అభిమానులకు OTTలో కూడా ఫుల్ మిల్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.