Triptii Dimri: ‘యానిమల్’‌లో బోల్డ్ సీన్స్‌‌ చేయడంపై.. నా పేరెంట్స్ రియాక్షన్ ఇదే

by Hamsa |   ( Updated:2023-12-12 06:19:25.0  )
Triptii Dimri: ‘యానిమల్’‌లో బోల్డ్ సీన్స్‌‌ చేయడంపై.. నా పేరెంట్స్ రియాక్షన్ ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందనా-రణబీర్ కపూర్ జంటగా నటించిన చిత్రం ‘యానిమల్’. దీనిని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించారు. ఈ సినిమా డిసెంబర్ 1న థియేటర్స్‌లో విడుదలై హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఇందులో బోల్డ్ సీన్స్ నటించి బాలీవుడ్ యంగ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి సెన్సేషన్‌ క్రియేట్ చేసింది. ఇప్పుడు బాలీవుడ్‌లోనే కాకుండా దాదాపు అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీలో త్రిప్తి హాట్ టాపిక్‌గా మారింది.

తన యాక్టింగ్‌తో అందరినీ కట్టిపడేసింది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిప్తి యానిమల్‌లో బోల్డ్ సీన్స్‌ చూసాక తన పేరెంట్స్ ఫీల్ అయ్యారని ఆసక్తికర విషయాలు పంచుకుంది. ‘‘ యానిమల్ చూసిన తర్వాత మా పేరెంట్స్ చాలా ఫీలయ్యారు. ఇలాంటి సీన్లు చేయకుండా ఉండాల్సిందని అన్నారు. దీంతో నేనేం తప్పుచేయలేదు. ఓ యాక్టర్‌గా నా పని నేను చేశాను అని నా పేరెంట్స్‌కు అర్థం అయ్యేలా చెప్పాను. మొదటి ఫీలయినప్పటికీ తర్వాత వారు నన్ను అర్థం చేసుకున్నారు’’ అంటూ చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story