రాజకీయాల ఎంట్రీపై మనోజ్ రియాక్షన్ ఇదే..

by sudharani |   ( Updated:2023-03-06 09:11:28.0  )
రాజకీయాల ఎంట్రీపై మనోజ్ రియాక్షన్ ఇదే..
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో మంచు మనోజ్, భూమా మౌనికల పెళ్లి కనుల పండువగా జరిగిన విషయం తెలిసిందే. కొత్త జంట ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ తన రాజకీయ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చాడు. మనోజ్ మాట్లాడుతూ.. ‘‘ప్రేమ ఎప్పుడు గెలవాలని నేను కోరుకున్నాను. 12 సంవత్సరాలుగా నేను ప్రేమలో ఉన్నాను. 6 సంవత్సరాలు కష్టాలు అనుభవించాను. ఎక్కడ అయితే ఆగానో.. మళ్లీ అక్కడ నుంచే ప్రారంభించాను. నాకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు. కానీ, ప్రజా సేవ చేయాలని కోరిక ఉంది. మౌనిక రాజకీయాల్లోకి వస్తే మద్దతు ఇస్తా’’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా.. మనోజ్ కామెంట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story