- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Samantha: ఆవేశంలో జరిగిపోయాయి.. ఇప్పుడు చేయగలిగిందేమీ లేదంటూ సమంత ఎమోషనల్ కామెంట్స్.. విడాకుల గురించేనా?
దిశ, సినిమా: ‘ఏమాయ చేశావే’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సమంత అందరికీ సుపరిచితమే. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్‌గా రాణిస్తుంది. అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకొని పట్టుమని 4 ఇయర్స్ కూడా కలిసి ఉండలేక విడాకులు తీసుకుని దూరంగా ఉంటూ ఎవరి పని వారు చేసుకుంటున్నారు. ఆ మధ్య ఈ బ్యూటీ మయోసైటీస్ అనే వ్యాధి బారిన పడటం వల్ల సినిమాలకు దూరంగా ఉంటూ తన హెల్త్‌పై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. అలాగే నిత్యం సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ యోగా వీడియోలు, తన హాట్ ఫోటోలు వంటివి షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది.
ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ..మన జీవితంలో కొన్ని విషయాలను నేర్చుకోవాలని.. మరికొన్నింటిని మార్చుకోవాలని అందరూ భావిస్తారు. అలాగే జీవితంలో కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు అయ్యో ఇలా జరగకుండా ఉంటే బాగుండేది అని కూడా అనుకుంటాము. కానీ, అవి జరిగిపోయిన తర్వాత మార్చుకోవాలన్నా సాధ్యపడదు. ఆ తర్వాత వెనుతిరిగి చూసుకున్నప్పటికీ ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి జీవితంలో ఎదురవుతున్న ప్రతి కష్టాన్ని ఎదుర్కోవాల్సిందేనని సమంత స్పష్టం చేసింది.
అలాగే ఎదురయ్యే కష్టాలను ఎదుర్కొన్నప్పుడే జీవితాన్ని గెలిచినట్లు అవుతుందని, జరిగిపోయిన గతంతో పోలిస్తే తాను ఎంతో ధైర్యంగా సమస్యలపై పోరాడానన్నారు. ప్రస్తుతం ఈ స్థాయికి చేరుకోవడానికి అగ్నిగుండం లాంటి సమస్యలను సైతం అధిగమించామని సమంత చెప్పుకొచ్చారు. దీంతో ఆమె మాట్లాడిన మాటలన్నీ విడాకుల గురించే అని అందరికీ అర్థమైంది. కాగా ఇప్పటివరకు చై, సామ్ విడాకులపై బహిరంగంగా స్పందించలేదు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.