'సీతారామం' కథను మొదట విన్న హీరోలు వీళ్లే

by srinivas |   ( Updated:2022-08-18 03:52:12.0  )
సీతారామం కథను మొదట విన్న హీరోలు వీళ్లే
X

దిశ, వెబ్‌డెస్క్: దుల్కర్ సల్మాన్, హను రాఘవపూడి కాంబినేషనల్‌ వచ్చిన 'సీతారామం' సినిమా అదరగొడుతోంది. అద్భుతమైన కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ఈ సినిమాతో మృణాల్ ఠాకూర్ తెలుగులో అరంగేట్రం చేయగా.. రష్మిక మందన్న, సుమంత్ ప్రధాన పాత్రలో నటించారు. అయితే, ఈ సినిమా కథను దుల్కర్ సల్మాన్ కంటే ముందు విజయ్ దేవరకొండ విన్నట్లు, కానీ విజయ్‌కి కథ అంతగా నచ్చకపోవడంతో వదులుకున్నట్టు ఈ సినిమా డైరెక్టర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. నాచురల్ స్టార్ నాని, రామ్ పోతినేని వీరికి కూడా చెప్పానని, వాళ్లు కూడా ఇంట్రెస్ట్ చూపలేదని చెప్పుకొచ్చారు. దీంతో మంచి సినిమాను తెలుగు హీరోలు మిస్ చేసుకున్నారని అభిమానులు ఫీల్ అవుతున్నారు.

'సీతారామం'పై వెంకయ్య నాయుడు ప్రశంసలు..

సౌత్ ఇండియా అగ్ర హీరోలలో ఆ హీరో రెండో స్థానంSita Ramam' movie

Advertisement

Next Story