జూన్ 2న రిలీజ్ అయ్యే ఐదు తెలుగు సినిమాలు ఇవే..

by Hamsa |   ( Updated:2023-05-29 10:14:31.0  )
జూన్ 2న రిలీజ్ అయ్యే  ఐదు తెలుగు సినిమాలు ఇవే..
X

దిశ, సినిమా: ఈ శుక్రవారం థియేటర్ లో రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సినిమాలు ఇవే.. టాలీవుడ్ అగ్ర నిర్మాత సురేష్‌బాబు చిన్నకొడుకు అభిరామ్ ద‌గ్గుబాటి ‘అహింస’ సినిమాతో హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. ఈ మూవీ జూన్ 2న శుక్రవారం రిలీజ్ అవుతుంది. దీంతో పాటుగా టాలీవుడ్ సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ బెల్లంకొండ సురేష్‌బాబు త‌న‌యుడు గ‌ణేష్‌బాబు హీరోగా నటించిన ‘నేను స్టూడెంట్ సార్’ కూడా జూన్ 2న రిలీజ్ కానుంది. ‘ప‌రేషాన్’ మూవీ కూడా ఈ వార‌మే థియేటర్లలో సంద‌డి చేయ‌బోతుంది. అలాగే ఈ మూడు సినిమాల‌తో పాటు సీనియ‌ర్ న‌టుడు అజ‌య్ ప్రధాన పాత్ర పోషించిన ‘చ‌క్రవ్యూహం’ , ‘ఐక్యూ ది ప‌వ‌ర్ అఫ్ స్టూడెంట్’ కూడా ఈ శుక్రవారమే థియేట‌ర్లలోకి రాబోతున్నాయి.

Read More... Shraddha Das :బ్లాక్ బికినీలో హీట్ పెంచుతున్న శ్రద్ధా దాస్

Advertisement

Next Story