మా అమ్మ నాతో గడిపిన చివరి క్షణాలు ఇవే : జాన్వీ

by sudharani |   ( Updated:2023-07-08 09:49:25.0  )
మా అమ్మ నాతో గడిపిన చివరి క్షణాలు ఇవే : జాన్వీ
X

దిశ, సినిమా: శ్రీదేవి డాటర్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. ఇప్పటి వరకు అనుకున్నంత భారీ హిట్ మాత్రం అందుకోలేదు. ఇక తాజాగా ఆమె సక్సెస్ కోసం ట్రై చేస్తూ.. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’ సినిమా లో హీరోయిన్ గా సౌత్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తోంది. ఇకపోతే తాజాగా జాన్వీ కపూర్ సోషల్ మీడియా వేదికగా తన తల్లిని తలుచుకుంటూ ఎంతో ఎమోషనల్ అయ్యారు.

‘మా అమ్మ మరణం మా జీవితంలో ఎప్పటికీ తీరని లోటు. ఆ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. నేను నా గదిలో పడుకొని ఉన్నాను. అమ్మ నా దగ్గరకు వచ్చి నన్ను పట్టుకుని నా తలపై తన చేతులు వేసి అక్కడే కూర్చుంది. అవే అమ్మ నాతో గడిపిన చివరి క్షణాలు.. అమ్మ మరణించిన తర్వాత మా కుటుంబం మొత్తం ఒకటైంది. కాకపోతే అమ్మలేని లోటు మాత్రం అలానే ఉంది’ అంటూ ఎమోషనల్ అయ్యింది జాన్వీ.

Read More..

స్టార్ హీరోతో అలా చేసేందుకు ముచ్చటపడుతున్న సమంత.. మాస్టర్ ప్లాన్ అదిరిందంటున్న నెటిజన్లు?

Advertisement

Next Story