Shine Tom Chacko: ఆ ఆరోగ్య సమస్య నాకు మంచే చేసిందంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన యంగ్ హీరో?

by Prasanna |
Shine Tom Chacko: ఆ ఆరోగ్య సమస్య నాకు మంచే చేసిందంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన యంగ్ హీరో?
X

దిశ, సినిమా: ఈ మధ్య నటీ నటులు అరుదైన వ్యాధులతో బాధ పడుతున్నారు. సమంత మయోటైటిస్ తో ఎంత ఇబ్బంది పడిందో మనకి తెలిసిందే. తాజాగా మలయాళ నటుడు వింత ఆరోగ్య సమస్యతో సఫర్ అవుతున్నట్టు ఇంటర్వ్యూలో వెల్లడించాడు. దీని గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..

హిట్ సినిమాలలో నటించిన మంచి గుర్తింపు తెచ్చుకున్న షైన్ టామ్ చాకో.. ‘దసరా’ మూవీతో మన తెలుగు వారికీ కూడా ఆడియన్స్ కు దగ్గరయ్యాడు. ప్రస్తుతం జూ. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ‘దేవర’ మూవీలో విలన్ పాత్ర చేస్తున్నాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ADHD అనే వ్యాధి ఉందని ఓపెన్ గా షైన్ టామ్ వెల్లడించాడు.

ADHD అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. దీని వలన నాడీ వ్యవస్థ దెబ్బ తింటుంది. “ ఈ వ్యాధి ఉన్న వ్యక్తులు ఎదుటి వాళ్లకు నచ్చాలని చాలా ప్రయత్నిస్తుంటారు. ఇదే నన్ను నటుడు చేసింది. అందరిలో ఈ లక్షణం కనిపిస్తుంటుంది. దాని వలన అందంగా మారాలని అనుకుంటాం. ADHD ఉన్నవారిలో ఈ ప్రవర్తన చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక రకంగా ఇది నాకు చాలా మంచే చేసింది. బయట వ్యక్తులు దీన్ని ఓ వ్యాధిలా చూస్తారు కానీ ఓ క్వాలిటీలానే చూస్తానని” అని షైన్ తన మాటల్లో చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story