- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
విషాదం.. ప్రముఖ ప్రోడ్యూసర్ భార్య, మాజీ సీఎం కూతురు మృతి
by Mahesh |
X
దిశ, వెబ్ డెస్క్: సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత అయిన శ్యామ్ ప్రసాద్ రెడ్డి భార్య వరలక్ష్మీ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ.. బుధవారం తుదిశ్వాస విడిచినట్లు బంధువులు తెలిపారు. ఇదిలా ఉంటే వరలక్ష్మీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమర్తె. ఆమెను శ్యామ్ ప్రసాద్ రెడ్డి వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత నిర్మాతగా అవతరించిన ఆయన మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ ద్వారా ఎంతో మందిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ముఖ్యంగా జబర్దస్త్ కామెడీ షో తో టెలివిజన్ ప్రోగ్రాం లో కొత్త ప్రయోగంతో సక్సెస్ అయ్యారు. దీంతో వరలక్ష్మీ పాత్ర కూడా ఉన్నట్లు పలువురు చెబుతున్నారు. ఆమె మరణ వార్త విన్న ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
Advertisement
Next Story