త్వరలోనే ‘కిక్’ సినిమా సీక్వెల్.. డైరెక్టర్ ఇచ్చిన అప్‌డేట్‌తో ఆనందంలో ఫ్యాన్స్

by sudharani |   ( Updated:2024-10-04 15:10:27.0  )
త్వరలోనే ‘కిక్’ సినిమా సీక్వెల్.. డైరెక్టర్ ఇచ్చిన అప్‌డేట్‌తో ఆనందంలో ఫ్యాన్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రజెంట్ ‘సికందర్’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తుండగా.. రష్మిక మందన్న, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే.. ఇంకా ఈ సినిమా రిలీజ్ కాకముందే సల్మాన్ తన తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నాడు. గతంలో సల్మాన్ ఖాన్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమా ‘కిక్’. 2014లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు.. భారీ కలెక్షన్లు రాబట్టింది. అయితే.. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని డైరెక్టర్ సాజిద్ నదియావాలా తాజాగా ప్రకటించారు. దాదాపు పదేళ్ల తర్వాత కిక్ సీక్వెల్‌ను మీ ముందుకు తీసుకొస్తున్నాము అని తెలిపారు. కాగా.. 2009లో టాలీవుడ్ మాస్ మహా రాజా రవితేజ హీరోగా నటించిన ‘కిక్’ మూవీ ఆధారంగా బాలీవుడ్‌లో కిక్ తెరకెక్కించారు. ఇందులో సల్మాన్ ఖాన్ సరసన జాక్వెలిన్ ఫెర్నాడెంజ్ నటించి మెప్పించింది.

Read More...

నాకు స్ఫూర్తిగా నిలిచినందుకు థాంక్స్.. మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్

Advertisement

Next Story

Most Viewed