Baby Movie : యూత్ చేసే తప్పులే సినిమా హిట్‌కు సూత్రాలు.. అవేంటంటే..?

by sudharani |   ( Updated:2023-07-28 12:06:34.0  )
Baby Movie : యూత్ చేసే తప్పులే సినిమా హిట్‌కు సూత్రాలు.. అవేంటంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్యకాలంలో వచ్చిన ప్రతీ చిన్న సినిమాలు ఎంతో పెద్ద హిట్ అవుతున్నాయి. చిన్న సినిమాలుగా వచ్చి బాక్సాఫీస్ వద్దా కాసుల వర్షం కురిపిస్తున్నాయి. వాటిలో ముఖ్యమైన సినిమా ‘బేబీ’. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ సునామీ సృష్టించింది. అయితే.. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవడానికి కారణం ఏంటో తెలుసా..? నేటి తరం యువత. వాళ్లు చేసే తప్పులు, ఎదుర్కొంటున్న సమస్యలు, పరిస్థితులు ఈ సినిమా హిట్‌కు మూల కారణం. అదెలా అనుకుంటున్నారా..? ప్రస్తుత కాలంలో చాలా మంది యువత ప్రేమ పేరుతో ఎన్నో తప్పులు చేస్తున్నారు. ఎదుటి వారి మనసులు గెలుచుకోవడానికి వారు చేసే పొరపాట్లతో వాళ్ల జీవితాలను ఎలా నాశనం చేసుకుంటున్నారో ప్రత్యక్షంగా ‘బేబీ’ సినిమాలో చూపించారు. అందుకే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయింది.

అలాగే.. ‘లవ్ టుడే’ సినిమా విషయానికి వస్తే ఇందులో కూడా యువత చేసే తప్పులనే సూత్రలుగా చేసుకుని తెరకెక్కించారు. మొబైల్ ఫోన్స్ మన జీవితంపై ఎంత పెద్ద ప్రభావాన్ని చూపిస్తున్నాయి అనేది చూపించారు. తమిళ్‌లో వచ్చిన ఈ సినిమా కూడా సూపర్ హిట్ కాగా.. దీనిని తెలుగులో రీమేక్ చేశారు. కాబట్టి.. నేటి తరంలో యువత చేసే తప్పులే సినిమా హిట్‌కు సూత్రాలు. యువత యాంగిల్‌లో సినిమాలు తెరకెక్కిస్తే.. అలాంటి మూవీలు కచ్చితంగా హిట్ టాక్ సొంతం చేసుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తాయి.

Advertisement

Next Story

Most Viewed