చంద్రముఖి సీక్వెల్‌ రిలీజ్.. అప్ డేట్..

by Aamani |   ( Updated:2023-05-15 11:07:20.0  )
చంద్రముఖి సీక్వెల్‌ రిలీజ్.. అప్ డేట్..
X

దిశ, సినిమా: పి వాసు దర్శకత్వంలో 2005లో విడుదలైన తమిళ క్లాసిక్ మూవీ ‘చంద్రముఖి’. రజనీకాంత్‌, ప్రభు, జ్యోతిక, నయనతార ప్రధానపాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దాదాపు 500 రోజులకుపైగా థియేటర్‌లో ఆడి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇక దాదాపు 17 ఏళ్ల తర్వాత సీక్వెల్‌గా ‘చంద్రముఖి-2’ ని కూడా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు పి వాసు. ఇందులో రాఘవ లారెన్స్‌ కథానాయకుడిగా, రాధికా శరత్‌కుమార్, లక్ష్మీ మీనన్, మహిమా నంబియార్, శ్రుతి డాంగే, సుభిక్ష కృష్ణన్, రవి మారియా, కార్తీక్ శ్రీనివాస్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ నటి కంగన కూడా ముఖ్య పాత్ర పోషిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 15న గణేష్ చతుర్థికి విడుదల చేయడానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుండగా... అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Read more:

The Kerala Story : ఇదే నా చివరి సినిమా అనుకుంటా: Adah Sharma

బాగానే ఉన్నాను.. యాక్సిడెంట్ పై స్పందించిన Adah Sharma

Advertisement

Next Story

Most Viewed