స్కూల్ ఫీజ్ కూడా కట్టలేక ఇబ్బంది పడిన అమ్మాయి.. నేడు కోట్లు సంపాదిస్తున్న స్టార్ హీరోయిన్

by Prasanna |
స్కూల్ ఫీజ్ కూడా కట్టలేక ఇబ్బంది పడిన అమ్మాయి.. నేడు కోట్లు సంపాదిస్తున్న స్టార్ హీరోయిన్
X

దిశ, సినిమా: స్టార్ పిల్లలను అందరూ "గోల్డెన్ బేబీస్ " అనుకుంటుంటారు. అయితే, వారు అందరిలాగే సవాళ్లను ఎదుర్కొంటారు. ఎంత పెద్ద స్టార్ లు అయినా కొన్ని సందర్భాలలో వాళ్లు కూడా డబ్బు పోగొట్టుకుని వీధిన పడుతుంటారు. ఇప్పుడు చెప్పబోయే ఈ ముద్దుగుమ్మ ఒకప్పుడు స్కూల్ ఫీజ్ కూడా కట్టడానికి కూడా ఇబ్బంది పడింది. నేడు కోట్లు సంపాదిస్తుంది. ఆమె ఎవరో ఇక్కడ తెలుసుకుందాం..

బాలీవుడ్‌ను శాసించిన క కపూర్ కుటుంబానికి చెందిన కుమార్తె. బాలీవుడ్ నటుడు రాజ్ కపూర్ మనవరాలు.. రణధీర్ కపూర్, బిబతల కుమార్తెగా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన కరీనా కపూర్ గురించి ఎంత చెప్పిన తక్కువే. ఈ ముద్దుగుమ్మ 1980లో జన్మించింది.ఆమె అక్క కరిష్మా కపూర్ కూడా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది. ఒకప్పుడు, రణధీర్ కపూర్ 80లలో ఎన్నో ఆర్ధిక సమస్యలు ఎదుర్కొన్నా నని కపిల్ శర్మ షోలో చెప్పుకొచ్చాడు.

ఆ సమయంలో తన ఇద్దరు కూతుళ్ల స్కూల్ ఫీజు కట్టేందుకు కూడా తన వద్ద డబ్బులు లేవని రణధీర్ కపూర్ చెప్పాడు. 2011లో కూడా కరీనా అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు. సినిమా దెబ్బకు తన కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడిందని వెల్లడించారు. కరీనా కపూర్ 2000లో అభిషేక్ బచ్చన్ నటించిన రెఫ్యూజీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత అగ్ర కథానాయికగా దేశంలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటిగా నిలిచింది.

Advertisement

Next Story