ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా.. సింగర్ సునీత ఎమోషనల్ కామెంట్స్

by Hamsa |   ( Updated:2024-01-22 05:44:45.0  )
ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా.. సింగర్ సునీత ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: సింగర్ సునీత ఎన్నో పాటలతో స్టార్ డమ్ సంపాదించుకుంది. స్టార్ హీరోల చిత్రాల్లో తన పాటలు పాడి తన గొంతుతో అందరినీ కట్టిపడేసింది. సునీత ఇటీవల సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు విషయాలపై స్పందిస్తుంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన జీవితంలోని అనుభవాలను తలుచుకొని ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ‘‘వారికి కావాల్సింది ఇవ్వకపోతే కొందరు మాటలతో వేధిస్తారు. నేను కూడా ఎన్నో సార్లు ఇలా అవమానాలు ఎదుర్కొన్న దాన్నే, కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఈ రోజు నాకున్న ఇమేజ్ కారణంగా నన్ను ఎవరు వేలెత్తి చూపి మాట్లాడరు. కొన్నేళ్లు వెనక్కి వెళితే మాత్రం కొందరు ఎలా పడితే అలా మాట్లాడేవారు. అన్ని తట్టుకుని నిలబడ్డాను కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉండగలిగాను.

దేవుడి దయ వల్ల ఎవరికి లొంగ వలసిన అవసరం రాలేదు. సినిమా పరిశ్రమలో ఏ బంధాలు శాశ్వతం కాదు. ఎవరి పైన ఆధారపడాల్సిన అవసరం లేదు మనలో టాలెంట్ ఉంటే మనల్ని అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వచ్చిన ప్రతి అవకాశం ఒక వరం లాంటిది అది అందుకొని నిలబడ్డాను. కాబట్టే ఒంటరి మహిళగా ప్రయాణాన్ని ఏళ్లపాటు కొనసాగించాను. ఈ రోజు నాకు ఒక తోడు దొరికింది.. నేను సంతోషంగా ఉన్నాను. కానీ చాలామంది జీవితాలు నాలా ఉండవు. సినిమా పరిశ్రమ అంత సులువైన దారి కాదు’’ అంటూ చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story

Most Viewed