- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రతి ఒక్కరిని బాల్యంలోకి తీసుకెళ్లే ‘దసరా’ పాట..!
దిశ, వెబ్‌డెస్క్: శ్రీకాంత్ ఓదేల దర్శకత్వంలో తెరకెక్కనున్న నాని హీరోగా చేసిన ‘దసరా’ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. కథా నేపథ్యం.. నానీ, కీర్తి సురేష్ మాస్ లుక్.. ఇద్దరి యాస.. ఒక వైపున ప్రేమ మరో వైపున ఎమోషనల్.. ఇంకో వైపున.. యాక్షన్ ఇవన్నీ ఫ్యాన్స్‌కు ఈ సినిమాపై ఆసక్తినీ పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి నాలుగో లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. ‘ఓ అమ్మలాలో.. అమ్మలాలో’ అంటూ ఈ పాట నెటిజన్లను కచ్చితంగా ఆకట్టుకుంటుంది. హీరో, హీరోయిన్ బాల్యం రోజుల్లో వారు గడిపిన ఆనందకరమైన క్షణాలు, అనుభూతులను పంచుకున్న సంఘటనలను కలుపుతూ ఈ పాట తెరపైకి రానుంది. ఒకప్పటి బాల్యాన్ని తప్పకుండా కళ్లముందుంచే పాట ఇది. ప్రతి ఒక్కరికీ ఈ సాంగ్ బాగా కనెక్ట్ అవుతుంది. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకీ, సంతోష్ నారాయణ్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ చిత్రం ఐదు భాషల్లో ఈ నెల(మార్చి) 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇవి కూడా చదవండి: ప్రియాంకను టార్గెట్ చేసి వెళ్లగొట్టింది ఆయనే.. కంగన కామెంట్స్ వైరల్