- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ పార్ట్‌కు సర్జరీ చేయమన్నందుకు డాక్టర్ చంపేస్తా అని అన్నాడు.. నివేదా పేతురాజ్ షాకింగ్ కామెంట్స్
దిశ, సినిమా: ‘దాస్ కా ధమ్కీ’ సినిమాలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్న నివేదా పేతురాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తెలుగులోనే కాకుండా తమిళ సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తుంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ మరోవైపు బ్యాడ్మింటన్ గేమ్‌లో అదరగొడుతూ కప్పులు గెలుస్తుంది. ఇక సినిమాల ద్వారా అంత గుర్తింపు రాకపోవడంతో వెబ్ సిరీస్ వైపు మళ్ళింది ఈ బ్యూటీ. ఈ క్రమంలోనే రీసెంట్‌గా పరుపు అనే తెలుగు వెబ్ సిరీస్‌లో నటించి మెప్పించింది నివేదా పేతురాజ్. ఈ సిరీస్‌కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే తెలుగులో విడుదలైన ఈ వెబ్ సిరీస్ కోసం ప్రమోషన్స్‌లో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొన్న ఈ అమ్మడు ఓ సందర్భంలో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. మరీ ముఖ్యంగా తాను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలనుకున్నట్టు తన కోరిక గురించి కూడా మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఆమె మాట్లాడుతూ.. "నాకు ప్లం లిప్స్ అంటే చాలా ఇష్టం.. నా పెదాలను కూడా అలా మార్చుకోవాలని ప్రయత్నం చేశాను. దాని కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలి అని అనుకున్నాను. ఈ విషయం మా ఫ్యామిలీ డాక్టర్ దృష్టికి తీసుకెళ్లాను.. అప్పుడు డాక్టర్ ఇంజెక్షన్ తీసుకుంటావా అని అడిగారు. నేను సరే అన్నాను.. అయితే నిన్ను చంపేస్తాను ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే అని డాక్టర్ సరదాగా బెదిరించాడు. ఇలాంటివి మంచిది కాదని ఫ్యూచర్‌లో చాలా ఆరోగ్య సమస్యలు ఫేస్ చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
అలాగే ఇప్పుడు ఉన్న చాలా మంది హీరోయిన్లు ముఖాలు మార్చుకుని రకరకాల ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటున్నారు. కానీ నన్ను అడిగితే ఇది మంచిది కాదు అనే చెప్తాను. ఇలా సర్జరీ చేయించుకోకుండానే స్టార్ డమ్‌ను చూసిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు. సాయి పల్లవి, నిత్యామీనన్ లాంటివారు ఏం సర్జరీలు చేయించుకోలేదు కదా.. అసలు వారు మేకప్‌నే సరిగ్గా ఇష్టపడరు. అయినా వారు అందంగా ఉన్నారు కదా అని నివేదా పేతురాజ్ చెప్పుకొచ్చారు.