మమ్ముట్టి తల్లికి సంతాపం తెలిపిన ‘ఏజెంట్’ టీమ్

by Prasanna |   ( Updated:2023-04-22 11:35:18.0  )
మమ్ముట్టి తల్లికి  సంతాపం తెలిపిన ‘ఏజెంట్’ టీమ్
X

దిశ,సినిమా: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అఖిల్ నటించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ విడుదల సమయం దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ అంతా ప్రమోషన్‌లో బిజీగా ఉండగా తాజాగా ఓ విషాద వార్త వినాల్సి వచ్చింది. ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా శుక్రవారం మమ్ముట్టి తల్లి ఫాతిమా ఇస్మాయిల్ వయసు సంబంధిత సమస్యతో తన 93 వ ఏటా కన్ను మూశారు. దీంతో ‘ఏజెంట్’ చిత్ర యూనిట్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మమ్ముట్టిగారి కుటుంబం పట్ల సానుభూతి వ్యక్తం చేస్తూ ఆమే పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.

Read More: 'ఏజెంట్' సెన్సార్ పూర్తి

Advertisement

Next Story