- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Shraddha Kapoor : అందులోనే నాకు ఆనందం దొరుకుతుంది
దిశ, సినిమా: సినీ సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవడంలో ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఉంటారు. ఒక్కప్పుడు ఎక్కడో షూటింగ్ జరుగుతున్న చోటుకు వెళ్లి దూరంగా నిలబడి తమ అభిమాన నటులను చూసి ఆనందపడేవారు. కానీ ఈ సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుండి సెలబ్రిటీలే స్వయంగా వారి పర్సనల్ లైఫ్ గురించి అభిమానులతో పంచుకుంటున్నారు. ఫ్యాన్స్ కూడా నేరుగా సెలబ్రిటీలతో మాట్లాడుతూ తాము అడగాల్సిన ప్రశ్నలు అన్ని అడిగేస్తున్నారు. స్వయంగా ఇంటికి వెళ్లి మరి కలుస్తున్నారు.
అయితే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ ఈ స్టార్ డమ్ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి.. ‘ నాకు తెలిసినంత వరకు ఈ స్టార్ డమ్ అనేది శాశ్వతంగా ఉండదు. అందుకే సామాన్యురాలిగా బతకడమే నాకు ఇష్టం. ఇప్పటికీ స్వయంగా నేనే మార్కెట్‌కు వెళ్లి ఇంటి వస్తువులు తెచ్చుకుంటాను. అందరితో కలిసి బయట పావుబాజీ తింటాను అందులోనే నాకు ఆనందం దొరుకుతుంది’ అని తెలిపింది శ్రద్ధ.
నిజానికి బాలీవుడ్ హీరోయిన్‌లలో సాదాసీదాగా ఉండటం శ్రద్ధ కు మాత్రమే సొంతం అని చెప్పాలి. ఇక ఇటీవల తన పుట్టినరోజును కూడా అభిమానులతో కలిసి జరుపుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇలా స్టార్ హీరోయిన్‌గా అయినప్పటికీ.. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ అభిమానులకు ఎప్పుడు దగ్గరగా ఉంటుంది.
- Tags
- shraddha kapoor