పదేళ్ల నయన్.. రెండేళ్ల విక్కీ నయన్.. రెండవ వివాహ వార్షికోత్సవంలోకి అడుగుపెట్టిన స్టార్ కపుల్స్

by Kavitha |
పదేళ్ల నయన్.. రెండేళ్ల విక్కీ నయన్.. రెండవ వివాహ వార్షికోత్సవంలోకి అడుగుపెట్టిన స్టార్ కపుల్స్
X

దిశ, సినిమా: కోలీవుడ్‌ డైరెక్టర్‌ విఘ్నేశ్‌ శివన్‌, స్టార్ హీరోయిన్‌ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2015లో నయనతార హీరోయిన్‌గా నటించిన నానుమ్‌ రౌడీ దాన్‌ (తెలుగులో 'నేను రౌడీ' ) అనే సినిమాకు విక్కీ డైరక్టింగ్ చేశాడు. ఇక ఈ సినిమా షూటింగ్‌లో ఏర్పడిన పరిచయం.. కొద్ది కాలానికే ప్రేమగా మారి ఏడేళ్ల పాటు ప్రేమలో ఉన్న విక్కీ-నయన్.. 2022 జూన్‌ 9న పెళ్లి చేసుకుని దాంపత్య బంధంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత సరోసగి ద్వారా ఇద్దరు కుమారులకు (ఉయిర్‌, ఉలగం) తల్లిదండ్రులయ్యారు.

ఇదిలా ఉండగా నిన్న వారి సెకెండ్ యానివర్సరి సందర్భంగా విఘ్నేశ్ శివన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్పెషల్ పోస్ట్ చేశారు. తన సతీమణి నయనతారతో కలిసి చిల్ అవుతున్న వీడియోను పంచుకున్నారు. దీనిలో భాగంగా పదేళ్ల బంధం తమ మధ్య ఉందని.. 'పదేళ్ల నయనతార, రెండేళ్ల విక్కీ-నయన్ అనే క్యాప్షన్ పెట్టాడు. ఇవాళ మా రెండో వివాహ వార్షికోత్సవం. నిన్ను పెళ్లి చేసుకోవడం.. ఉయిర్, ఉలగం రావడం నా జీవితంలోకి గొప్ప విషయం. నా భార్య తంగమేయిని చాలా ప్రేమిస్తున్నా.

మరెన్నో ఆహ్లాదకరమైన సమయాలు, జ్ఞాపకాలు, విజయవంతమైన క్షణాలు ఉండాలని కోరుకుంటున్నా. జీవితంలో గెలుపు ఓటములు, ప్రశంసలు, విమర్శలు అన్ని ఉంటాయి. ఏ పరిస్థితుల్లోనైనా నీకు తోడుగా ఉంటా. ఆ భగవంతుడు ఎల్లవేళలా మనకు అండగా నిలవాలని కోరుకుంటున్నాను. మన ఉయిర్, ఉలగంతో సంతోషంగా ఉండాలనేదే నా ఆశయం. మన పెద్ద పెద్ద ఆశయాలు నెరవేరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా' అని విఘ్నేశ్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. అదే విధంగా వీరిద్దరికి సెలబ్రీటిల నుంచి అభిమానుల నుంచి విషెస్ అందుతున్నాయి.

Advertisement

Next Story