- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హనుమాన్ కోసం తేజా సజ్జా 10 కాదు 20 కాదు.. ఏకంగా ఎన్ని చిత్రాలు వదులుకున్నాడో తెలుసా?
దిశ, సినిమా: ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన హనుమాన్ చిత్రం ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఒక్క సినిమాతో ప్రశాంత్ వర్మ పాన్ ఇండియా దర్శకుడు అయిపోయాడు. హీరో తేజా సజ్జా నటనకు టాలీవుడ్ ఇండస్ట్రీ ఫిదా అయిపోయింది. అద్భుతమైన పర్ఫామెన్స్‌తో తేజా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆడియన్స్ వద్ద వందకు వంద మార్కులు కొట్టేశాడని చెప్పుకోవచ్చు.
సినిమా విడుదల తర్వాత తేజా పలు ఇంటర్వ్యూలకు హాజరై పలు ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కోసం ఎంతగానో కష్టపడ్డానని, షూటింగ్ సమయంలో కన్నుకు ఎఫెక్ట్ పడిందని, దీంతో డాక్టర్లు సర్జరీ చేయాలని చెప్పారని తేజా పంచుకున్నారు. తాజాగా ఈ హీరో మరో ఇంటర్వ్యూకు హాజరై.. ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు. ‘‘హనుమాన్ చిత్రం కోసం రెండున్నర ఏళ్లు కష్టపడ్డాను. ఈ క్రమంలో నాకు చాలా ఆఫర్లు వచ్చాయి.
దాదాపు 70 నుంచి 75 సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. 75 మూవీల్లోనూ 15 వరకు మంచి కంటెంట్ ఉన్న సినిమాలే. అలాగే ఈ మూవీ కోసం నేను సుమారు 25 లుక్ టెస్టులు ఇచ్చాను. కామన్‌గా ఏదైనా చిత్రం కోసం ఎవరైనా సరే.. 2, 3 టెస్టుల కంటే ఎక్కువ ఇవ్వరు. ఇందులో స్టంట్స్ అన్నీ నేనే చేశాను. బాడీ డబుల్ లేదా వీఎఫ్ఎక్స్ వాడలేదు. స్కూబా డైవింగ్ నేర్చుకుని మరీ వాటర్ లోపల సీక్వెన్స్ షూట్ చేశాను’’. అంటూ తేజా సజ్జా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ హీరో కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.